మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్” షూటింగ్ ఈరోజు పునఃప్రారంభమైంది. మెగా బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ వైబ్‌ను కొనసాగిస్తూ హై పాజిటివ్ ఎనర్జీతో రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని భారీ కోల్‌కతా సెట్‌లో ఈ రోజు ప్రారంభమైయింది.
వాల్తేరు వీరయ్యతో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో భోళా శంకర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెహర్ రమేష్, చిరంజీవిని స్టైలిష్, ఇంకా మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా కథానాయికగా కనిపించనుంది.
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.
ఇవి కూడా చదవండి…