గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన అరకు ఎంపీ..

352
Araku MP

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ రోజు విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండల, శర్భన్నపాలెం గ్రామాల్లో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి ఆమె భర్త శివ ప్రసాద్ మొక్కలు నాటారు. పోలీస్ అధికారులు శర్భన్నపాలెం యూత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కల వల్లకలిగే ప్రయోజనాలను వివరించారు. రాబోవు తరాలకు కూడా మొక్కల విలువ తెలియాలి అని ఆమె మేనల్లుడు సాత్విక్ సింహ దేవ్ తో కూడా మొక్కల నాటించారు.

అలాగే ఈ ఛాలెంజ్ ప్రతిఒక్కరూ స్వీకరించాలి అని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో శివ ప్రసాద్, వైసీపీ రాష్ట్ర యువ నాయకులు గొడ్డేటి మహేష్, పోలీస్ అధికారులు, గ్రామస్తులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించాలని, ప్రతి రోజు ప్రముఖులను భాగస్వామ్యం చేయటాన్ని ఎంపీ మాధవి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ లు ప్రత్యేకంగా అభినందించారు.