‘భీమ్లా నాయక్’ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది..

96
- Advertisement -

టాలీవుడ్‌ పవర్‌ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలై వారం రోజుల పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు 100 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో సందడి చేయనుంది. హాట్ స్టార్ డిస్నీతో పాటు ఆహా కూడా ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నారు. భీమ్లా నాయక్ సినిమాను మార్చ్ 25న విడుదల చేయబోతున్నారు. ఆహా, హాట్ స్టార్ వేదికగా ఈ చిత్రం విడుదల కానుంది. అధికారికంగానూ దీనిపై ప్రకటించారు.

కొన్ని రోజులుగా భీమ్లా నాయక్ ఓటిటి రిలీజ్ డేట్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి.. విడుదలైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ సినిమాను అక్కడ విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అనుకున్నట్లుగానే అదే జరిగింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటించాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -