‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ పూర్తి..

47
- Advertisement -

జక్కన్న చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. 3 గంటల 6 నిమిషాల 54 సెకన్ల నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ సినిమా రూ.336 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, శ్రియ తదితరులు నటించారు.

- Advertisement -