భారత్‌తో కొర్రీలు వద్దు…మహీంద్రా

40
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ షేర్ల పతనంపై స్పందించారు. ఎప్పుడు వర్తమాన అంశాలు, హాస్యం పండించే దృశ్యాలు, సృజనాత్మకతను కల్పించే అంశాలపై స్పందించే మహీంద్రా తాజాగా అదానీ షేర్లపై కూడా స్పందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… నేను నా జీవిత కాలంలో భూకంపాలు, యుద్ధాలు, ఉగ్రదాడులు, మాంద్యం, కరువుకాటకాలు చాలినన్ని చూశాను. వాటిని చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. ఎప్పుడూ భారత్‌కు సవాళ్లు విసరకండి అని మహీంద్రా ట్వీట్ చేశారు.

వేల సంవత్సరాల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న భారతదేశం ఏనాడు చెక్కు చెదరకుండా ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా అదానీపై హిండెన్‌ బర్గ్ రీసెర్చ్‌ చేసిన నివేదికపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మహీంద్రా ట్వీట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి…

మోదీ…గ్లోబల్ లీడర్ అప్రూవల్‌

మమ్మల్ని ఎదుర్కొవం చాలా కష్టం…

భారత బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాము..

- Advertisement -