‘భరతనాట్యం’…సక్సెస్ మీట్

18
- Advertisement -

సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయికగా నటించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి సూపర్ హిట్ సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది

సక్సెస్ మీట్ లో దర్శకుడు కెవిఆర్ మహేంద్ర.. కొత్త హీరో, హీరోయిన్ తో కొత్త నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఇంత గ్రాండ్ సినిమా తీయడం, థియేటర్స్ లో విడుదల చేయడం డబుల్ టాస్క్. అన్ని సవాళ్ళుని దాటుకొని ఏపీ తెలంగాణలో 150+ థియేటర్స్ లో రిలీజ్ చేయడం పెద్ద సక్సెస్ గా భావిస్తున్నాం. థియేటర్స్ లో రెస్పాన్స్ అద్భుతంగా వుంది. చూసిన ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తున్నాడు. హీరో హీరోయిన్ తో పాటు వైవా హర్ష పాత్రకి అమెజింగ్ గా కనెక్ట్ అయ్యారు. వస్తున్న రెస్పాన్స్ చూసి ఆంధ్రలో తొమ్మిది థియేటర్స్ ని పెంచారు. ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ ఇచ్చాం. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. వీకెండ్స్ తో పాటు ఉగాది హాలీడేస్ కూడా మాకు హెల్ప్ అవుతాయి. సినిమా ఆడియన్స్ కి ఇంకా అద్భుతంగా రీచ్ అవుతుంది. తప్పకుండా సినిమా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

హీరో సూర్య తేజ ఏలే మాట్లాడుతూ..’భరతనాట్యం’ చూసిన ప్రేక్షకులంతా సినిమా చాలా బావుందని అభినందించారు. సెకండ్ హాఫ్ చాలా బావుందని, నేను చక్కగా నటించానని, మొదటి సినిమాల అనిపించలేదని చాలా మంది మెచ్చుకున్నారు. చిన్న సినిమా అనుకున్నాం కానీ చాలా పెద్ద సినిమాలా వుందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. పాయల్ గారు హై ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని నిర్మించారు. డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర గారి గురించి కూడా చాలా అద్భుతంగా చెబుతున్నారు. ఇంతమంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కు ధన్యవాదాలు. ఈసినిమాతో లాంచ్ అయినందుకు చాలా అనందంగా వుంది. తప్పకుండా సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

హీరోయిన్ మీనాక్షి గోస్వామి మాట్లాడుతూ.. సినిమాకి, నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా అద్భుతంగా వుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పుడూ వుండాలి’ తెలిపారు.

నిర్మాత పాయల్ సరాఫ్ మాట్లాడుతూ.. ‘భరతనాట్యం’కు చాలా అద్భుతమైన స్పందన వస్తోంది. ఇంత మంచి స్పంధన ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కథ, కంటెంట్ ని ప్రేక్షకులు చాలా మెచ్చుకుంటున్నారు. తొలి సినిమా నిర్మాతగా వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమా గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. మంచి రివ్యూస్ వచ్చాయి. సినిమా మున్ముందు ఇంకా అద్భుతంగా ఆడుతుంది. ఇంత మంచి ఆదరణ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. భవిష్యత్ లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తాం” అన్నారు.

Also Read:టిల్లు కోసం వస్తున్న దేవర!

- Advertisement -