భారతరత్న.. ఎల్‌కే అద్వానీ

32
- Advertisement -

దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న..బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి ఇవ్వనున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన మోడీ.. దేశానికి అద్వానీ సేవలను కొనియాడారు.

అద్వాని.. గొప్ప రాజనీతిజ్ఞుడని.. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర చరిత్రాత్మకమైనదని కొనియాడారు.అద్వానీకి భారతరత్న ఇవ్వనున్నట్లు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అట్టడుగు స్థాయి నుండి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు అతని జీవితం స్ఫూర్తిదాయమైందన్నారు.

జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన అసమానమైన కృషి చేశారన్నారు. ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం గర్వంగా ఉందని ఎమోషనల్ అయ్యారు మోడీ.

Also Read:మహేష్ కోసం ఆ ముగ్గురు రెడీ

- Advertisement -