జమ్మూలో భారత్ జోడో యాత్ర..

58
- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 30న జోడో యాత్ర ముగియనుండగా భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. తమిళనాడులోని కన్యాకుమారి నుండి యాత్ర ప్రారంభంకాగా దాదాపు 3500 కిమీలు సాగింది.

ఇక తాజాగా యాత్ర జమ్మూ కశ్మీర్‌కు చేరుకుంది. జమ్మూకశ్మీర్ చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తన ఇంటికి చేరుకున్నట్లు ఉందని చెప్పారు. తన పూర్వీకుల మూలాలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు.

దేశం గురించి, ప్రతి రాష్ట్రం గురించి, తన గురించి తాను ఎంతో నేర్చుకుంటున్నాని, అర్థం చేసుకుంటున్నానని రాహుల్ అన్నారు. జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న పాదయాత్రలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, మెహమూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాతో పాటు పలువురు నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -