భార‌త్ బంద్ విజ‌య‌వంతం.. రైతులకు అండగా నిలిచిన టీఆర్ఎస్..

260
Bharat Bandh
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు త‌ల‌పెట్టిన భార‌త్ బంద్ విజ‌య‌వంతంగా ముగిసింది. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు భార‌త్ బంద్ కొన‌సాగింది. భార‌త్ బంద్‌లో 25 రాజ‌కీయ పార్టీల‌తో పాటు ఉద్యోగ‌, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. రైతుల‌కు మ‌ద్ద‌తుగా దేశ వ్యాప్తంగా ధ‌ర్నాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు నిర్వ‌హించి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని రైతుల‌తో పాటు ఆయా పార్టీల నాయ‌కులు, ఉద్యోగ‌, కార్మిక సంఘాల నాయ‌కులు డిమాండ్ చేశారు. ప‌‌లు రాష్ట్రాల్లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము నుంచే రాస్తారోకోలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు.

ktr

ఇక తెలంగాణలో భార‌త్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, ప‌ట్ట‌ణ కేంద్రాల్లో రైతుల‌కు మ‌ద్ద‌తుగా టీఆర్ఎస్ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నారు. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో రాస్తారోకోలు నిర్వ‌హించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేశారు. రైతులు ట్రాక్ట‌ర్లు, ఎడ్ల బండ్ల‌తో ర్యాలీలు నిర్వ‌హించి.. కొత్త సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప‌లు చోట్ల బైక్ ర్యాలీలు నిర్వ‌హించారు.

mlc kavitha

షాద్‌న‌గ‌ర్ బూర్గుల టోల్ ప్లాజా వ‌ద్ద బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారిపై మంత్రి కేటీఆర్ బైఠాయించి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. కామారెడ్డి శివారులోని ఎల్లారెడ్డి పరిధిలోని టెక్రియాల్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత రైతుల‌కు మ‌ద్ద‌తుగా ధ‌ర్నాలో పాల్గొన్నారు. మెద‌క్ జిల్లాలోని తుఫ్రాన్ వ‌ద్ద హ‌రీష్ రావు, అలంపూర్ వ‌ద్ద నిరంజ‌న్ రెడ్డి, హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, హన్మకొండ-వరంగల్‌ హైవేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్దపల్లి జిల్లా ధర్మారం, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బంద్‌లో పాల్గొన్నారు.

srinivas goud
- Advertisement -