హింసాత్మకంగా భారత్‌ బంద్‌..

192
Bharat Bandh: 5 Dead As Protest, Violence Sweeps North India
- Advertisement -

నేడు (ఏప్రిల్2)పలు దళిత సంఘాలు భారత్‌ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా ‘సంవిధాన్ బచావో సంఘర్ష్ కమిటీ’ అనే దళిత సంఘం పిలుపు మేరకు సోమవారం ఉదయం నుంచి రోడ్లపైకి వచ్చిన నిరసనలు చేపట్టారు.

   Bharat Bandh: 5 Dead As Protest, Violence Sweeps North India

అయితే ఈ బంద్‌ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్ బంద్‌లో పాల్గొన్న నలుగురు విరసనకారులు చనిపోగా, అనేమంది గాయపడ్డారు. గ్వాలియర్‌లో రెండు గ్పూప్‌ల మధ్య జరిగిన గొడవలో ఇద్దు చనిపోయారు. బీదర్‌ లో ఒకరు, మోరెనాలో ఒకరు, చనిపోయారు.

మరోవైపు ఆందోళనలతో ఢిల్లీ-డెహ్రాడూన్ హైవే కూడా పూర్తిగా బ్లాక్ అయింది. రాజస్థాన్‌ లోని బర్మర్‌ సిటీలో పోలీసులకు, దళితులకు మధ్య జరిగిన గొడవ జరగడంతో పోలీసులు టియర్‌ గ్యాస్ ప్రయోగించారు. దీంతో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ఈ క్రమంలోనే అజంఘర్ లో ఓ బస్సుని తగలబెట్టారు ఆందోళనకారులు. కాగా..పలుచోట్ల రైళ్ల రాకపోకలను అడ్డకున్నారు.

- Advertisement -