రివ్యూ: భైరవగీత

273
review bhairavageetha
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మాతగా సిద్దార్థ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భైరవగీత. ధనుంజయ, ఇర్రామోర్‌లను హీరో హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా పిరియాడిక్‌ ఫ్యాక్షన్‌ డ్రామాగా విడుదలైన భైరవ గీత ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…

కథ :

రాయలసీమ నేపధ్యంలో సాగే ఓ ప్రేమకథ ‘భైరవగీత’. భైరవ (ధనుంజయ్) తాతల దగ్గర నుంచి ఇలా తరతరాలకు సుబ్బా రెడ్డి కుటుంబానికి బానిసలుగానే ఉంటుంటారు. ఈ క్రమంలో సుబ్బా రెడ్డి కూతురు గీత (ఇర్ర మోర్) పై సుబ్బా రెడ్డి శత్రువులు అటాక్ చేస్తారు.భైరవ ప్రాణాలకు తెగించి గీతను కాపాడతాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ హీరోతో ప్రేమలో పడటం,గొడవలు,చివరికి ఎలా ఒక్కటయ్యారు అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫి,సంగీతం. హీరో ధనుంజయ్ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ఫస్ట్ సినిమానే అయినా తన నటనతో అలాంటి ఫీలింగ్‌ని రానివ్వలేదు. ఇర్రా మోర్‌ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

bhairavageetha

మైనస్‌ పాయింట్స్‌ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ పాత కథ,ఓవర్ ఫ్యాక్షన్‌. అక్కడక్కడా కథనం స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. ఓవరాల్ అవసరానికి మించి హింసాత్మక సన్నివేశాలు ఎక్కువైపోవడం మరో మైనస్.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీనే హైలెట్ గా నిలుస్తోంది. లొకేషన్స్ అన్ని బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం కూడా చాల బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువులు బాగున్నాయి.

తీర్పు:

ఫ్యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం భైరవగీత.వ‌ర్మ స్టైల్ ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్క‌డ‌క్క‌గా కొన్ని స‌న్నివేశాలు ఆక‌ట్టుకున్నా, క‌థ‌, క‌థ‌నం విష‌యంలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం సినిమా యావరేజ్‌గా నిలిచిపోయింది.

విడుదల తేదీ:14/12/18
రేటింగ్: 2.25/5
నటీనటులు : ధనుంజయ, ఇర్రా మోర్‌
సంగీతం : రవి శంకర్‌
నిర్మాత : రామ్‌ గోపాల్ వర్మ
దర్శకత్వం : సిద్ధార్థ్‌ తాతోలు

- Advertisement -