15 రోజులు…700 కోట్లు

237
rajani 2.0
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబో తెరకెక్కిన విజువల్ వండర్ 2.0. నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది. విడుదలైన ప్రతిచోటా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టి రజనీ గత సినిమాల రికార్డులను తిరగరాసింది.

ఇప్పటివరకు 15 రోజుల్లో ఏకంగా 700 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. తొలివారంలో 526.86 కోట్లను రాబట్టగా రెండవ వారంలో 180 కోట్లను రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే 166 కోట్లు కొల్లగొట్టింది ఈ మూవీ.

రజనీకాంత్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ‘2.ఓ’ నిలిచింది. మరోవైపు పెట్టాతోనూ మ్యాజిక్ చేసేందుకు వస్తున్నారు రజనీ. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే టీజర్‌తో అంచనాలను పెంచేశాడు.

- Advertisement -