భద్రాద్రి రాములోరి దర్శనానికి అనుమతి..

215
Bhadrachalam Temple
- Advertisement -

భద్రాచలం సీతారామ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. నిత్యం ఉదయం 5 గంటలకు నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారిని దర్శించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అలాగే నిత్య కల్యాణం, ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో ఆదివారం లక్ష్మణసమేత సీతారాములకు పంచామృతాలతో సర్వాభిషేకం నిర్వహించారు. బంగారు పుష్పాలతో సీతారాములకు అర్చన నిర్వహించారు. అయితే, భక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడంతో పాటు భౌతిక దూరం తదితర కొవిడ్‌ నియమాలు పాటించాలని ఆలయ అధికారులు కోరారు.

- Advertisement -