సోషల్ మీడియాలో ‘బేతాళుడు’ ఫీవర్

258
Bethaludu videos viral on social media
- Advertisement -

గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో విజ‌య్ ఆంటోని. డా.సలీం, నకిలీ సినిమాలతో విభిన్న చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్, బిచ్చ‌గాడు తో స్టార్ ఇమేజ్ ను టాలీవుడ్ తెచ్చుకొగలిగారు. ఓ వైపు సంగీత ద‌ర్శ‌కుడిగా బిజీగా ఉంటూనే హీరోగా త‌న‌ని తాను సరికొత్తగా ఆవిష్క‌రించుకున్న ఆంటోని .. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ మార్కెట్లో హాట్ టాపిక్‌ గా మారిపొయాడు. అత‌డు న‌టించిన సినిమా వ‌స్తోంది అంటేనే అదో అటెన్షన్.

బేతాళుడు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లు, ట్రైల‌ర్స్ తో పాటు తొలి పది నిమిషాల సినిమాని కూడా ఆడియెన్స్ కు ముందుగానె చూపించారంటేనె విజయ్ ఈ సినిమా విజయం పై ఎంత కాన్పిడెన్స్‌తో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఉన్నారొ అర్దం చెసుకొవచ్చు.

Bethaludu videos viral on social media

తెలుగులో బేతాళుడు టైటిల్ తో విడుదల కానున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 1న  500కి పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అరుంధతీ నాయర్ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల పది నిమిషాల వీడియోతో మూవీపై భారీ అంచనాలు పెంచేసుకుంది. అదీ కాక బిచ్చగాడు మూవీ ఇచ్చిన జోష్ సైతాన్ సినిమాకు భారీ కలెక్షన్లు తెచ్చి పెట్టనుందని యూనిట్ భావిస్తోంది. తాజాగా సైతాన్ సినిమాకు సంబంధించి నాలుగు నిమిషాల వీడియోను ఈ ట్యూబ్ లో విడుదల చేశారు. ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోతో పాటు జయలక్ష్మీ ఫుల్ సాంగ్ ని తెలుగులో విడుదల చేశారు.

- Advertisement -