పవన్‌ ఆర్థిక స్థితి బాగాలేదు…

151

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు పైన ప్రశంసలు కురిపించిన మెగా సోదరుడు నాగబాబు తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. గొప్ప భావజాలం, మానవత్వం, గొప్ప గుణం పవన్ కు ఉన్న లక్షణాలని చెప్పారు. సాధారణంగా, ఏమీ చేయలేమనే నిరాశతో అనేక అంశాలను మనం వదిలేస్తుంటామని… కానీ, పవన్ కల్యాణ్ అలా కాదని… దేన్నీ అంత సాధారణంగా వదలడని చెప్పారు.

 Pawan-kalyan-photos-with-mega-family-6

సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ, కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారన్న ప్రశ్నకు అతని సోదరుడు నాగబాబు సమాధానమిచ్చారు. ఎవరైనా బాధ పడితే పవన్ తట్టుకోలేడని… ఎంతో నిరాశతోనే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాడని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరినందుకో, అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లేకపోవడం వల్లో జనసేనను పవన్ స్థాపించలేదని తెలిపారు. ప్రజలకు అండగా నిలబడాలనే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు.

1_7_13_mega brothers photos (14)

పవన్ కల్యాణ్ ఆర్థికి స్థితిపై మాట్లాడుతూ, పవన్ ఇంతకు ముందు చెప్పినట్టే, అతని ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేదని చెప్పారు. తన వల్ల కూడా తమ్ముడు కొంచెం డబ్బు నష్టపోయాడని తెలిపారు. అయితే, డబ్బుకు పవన్ ప్రాధాన్యత ఇవ్వడని… ఆర్థిక సమస్యలను లెక్క చేయడని చెప్పారు. మరో నాలుగు లేదా ఐదు సినిమాలు చేస్తే, ఆర్థికంగా సెటిల్ అవుతాడని… అప్పుడు రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తాడని తెలిపారు.

1_7_13_mega brothers photos (12)

మోడీ తీసుకున్న డిమోనిటైజేషన్ నిర్ణయానికి తన పూర్తి మద్దతు ఇస్తున్నానని, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే దేశం బాగుపడుతుందని నాగబాబు చెప్పుకొచ్చారు. దీని వల్ల ప్రజలు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నా…. దీర్ఘ కాలంలో అందరికీ మంచి జరుగుతుందని అన్నారు. మోడీ తీసుకున్న నిర్ణయం మీద నా అభిప్రాయం నేను చెప్పాను. దీని వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్నయ్యకో, జనసేన పార్టీ నడుపుతున్న తమ్ముడికో ఇబ్బంది కర పరిస్థితి ఏర్పడుతుందని నేను అనుకోవడం లేదు…. నేను కాంగ్రెస్ పార్టీ సాధారణ సభ్యుడిగా ఉన్నప్పటికీ మోడీ లాంటి వారు మంచి నిర్ణయాలు తీసుకున్నపుడు సమర్థిస్తాను అని నాగబాబు తెలిపారు.

ఇక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తమ్ముడు పవన్ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని, అయితే ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా తనగి జాగ్రత్తలు తీసుకోలేదు అని మాత్రమే అన్నారని నాగబాబు చెప్పుకొచ్చారు.