వివాహేతర సంబంధాల్లో బెంగళూరు టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఈ మేరకు గ్లీడెన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. బెంగళూరు తర్వాత ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, పూణె నిలిచాయి. ఇతర రంగాల కన్న ఐటీ, వైద్య రంగాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటున్నారని తెలిపింది గ్లీడెన్ సంస్థ.
భావోద్వేగ అసంతృప్తి, సాన్నిహిత్యం లోపం, మరియు తీరని భావోద్వేగ అవసరాలు ఈ ధోరణికి కారణమని వారు పేర్కొంటున్నారు. వివాహేతర సంబంధాల కోసం ఉపయోగించే ఫ్రెంచ్ యాప్ “గ్లీడెన్ (Gleeden)” ప్రకారం, బెంగళూరు ప్రధమ స్థానంలో ఉంది. భారతదేశంలో గ్లీడెన్ వినియోగదారుల్లో 17 శాతం మంది బెంగళూరువారే. వీరిలో ఎక్కువమంది 30 నుంచి 45 ఏళ్ల వయస్సు గల ప్రొఫెషనల్స్.
చాలామంది శారీరక సంబంధం కన్నా భావోద్వేగ అనుబంధం కోసం యాప్‌లో చేరుతున్నారు అని చెప్పారు. యాప్ వినియోగదారుల్లో 65 శాతం పురుషులు, 35 శాతం మహిళలు, వీరిలో ఎక్కువ మంది ఫైనాన్స్, లా, ఇంజినీరింగ్, వ్యాపార రంగాలకు చెందినవారు. గ్లీడెన్ ఇన్ఫిడెలిటీ స్టడీ 2025లో 12 నగరాల్లో 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,510 మందిని సర్వే చేశారు. ఆ అధ్యయనం ప్రకారం, బెంగళూరులో 29 శాతం మంది సోషల్ మీడియా ద్వారా ఫ్లర్టింగ్ చేసినట్లు అంగీకరించారు.
53 శాతం మంది ఏదో ఒక రూపంలో వ్యభిచారానికి పాల్పడ్డారని వెల్లడించారు.7% శారీరకంగా,12% భావోద్వేగంగా,34% రెండూ కలిపి ఉన్నారు. గత ఐదు సంవత్సరాల్లో బెంగళూరులో వ్యభిచార కేసులు 40 శాతం పెరిగాయి. చాలా మంది మహిళలు మొదట సాన్నిహిత్యం లేకపోవడమే కారణమని చెబుతారు, కానీ లోతైన సంభాషణల్లో వ్యభిచారం బయటపడుతుంది అని చెప్పారు. పురుషులు ఎక్కువగా 27–38 ఏళ్ల వయస్సులో ఉండగా, మహిళలు సాధారణంగా 35 లోపువారే. ఎక్కువ సంబంధాలు పరిచయం నుంచే మొదలవుతాయి — సహచరులు లేదా స్నేహితులు. మొదట భావోద్వేగ మద్దతుగా మొదలై తర్వాత శారీరక దశకు వెళ్తాయి అని తెలిపారు వైద్య నిపుణులు.
Also Read:BB9:ఆయేషా ఎలిమినేట్

