బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ (SP) ….ఇండియా (INDI) కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం స్టార్ ప్రచారకుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సీనియర్ నేత ఆజమ్ ఖాన్, ఎంపీలు రాజీవ్ రాయ్, ఇక్రా హసన్, ప్రియా సరోజ్ తదితర మొత్తం 20 మంది నేతల పేర్లు ఉన్నాయి.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఈ స్టార్ ప్రచారకులు త్వరలోనే ప్రచార బరిలోకి దిగనున్నారు.మహాఘట్ బంధన్ అభ్యర్థుల కోసం ప్రజా మద్దతును పెంచేందుకు కృషి చేయనున్నారు.
స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలిస్తే.. కిరణ్‌మయ నందా, అఫ్జల్ అంసారీ, అవధేశ్ ప్రసాద్, బాబు సింగ్ కుశ్వాహా, నరేష్ ఉత్తమ్ పటేల్, రామ శంకర్ విద్యార్థి, లాల్‌జీ వర్మా, చిన్న లాల్ ఖర్వార్, సనాతన్ పాండే, పప్పు నిశాద్, తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్, ఓం ప్రకాశ్ సింగ్, కాశీ యాదవ్ మరియు ధర్మేంద్ర సోలంకీ ఉన్నారు.
ఆజమ్ ఖాన్‌ను స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చడం ద్వారా పార్టీ ముస్లిం మైనారిటీ ఓటర్లను ఆకర్షించాలనే వ్యూహంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆ వర్గంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. అఖిలేష్ యాదవ్ మామలు, పార్టీ సీనియర్ నేతలు రామ్‌గోపాల్ యాదవ్ మరియు శివపాల్ యాదవ్ ఈ జాబితాలో లేకపోవడం విశేషం.
Also Read:మోనాష్ వర్సిటీ ప్రతినిధులతో శ్రీధర్ బాబు

