BB9:ఆయేషా ఎలిమినేట్

13
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా సాగుతోంది. ప్రతి ఎపిసోడ్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజా ఎపిసోడ్‌లో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అయేషా ..ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లోకి వచ్చిన రెండోవారంలోనే ఆమెను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.

అనారోగ్య కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుంచి వాలంటరీ ఎలిమినేటర్ అయ్యింది ఆయేషా. హౌస్‌లోకి వచ్చినప్పటి నుండి మెడికల్ రూంకి వెళ్తూ వస్తోంది. అయితే ఆమెకి ఫీవర్‌తో పాటు ఒళ్లు నొప్పులు అధికంగా ఉండటతో మెడికల్ టెస్ట్‌లు చేయగా టైఫాయిడ్‌తో పాటు డెంగ్యూ పాజిటివ్ రావడంతో హౌస్ నుంచి బయటకు పంపించారు బిగ్ బాస్.

తొలుత ఏడుస్తున్న ఆయేషాని చూసిన నిఖిల్.. ఏమైందని అడిగాడు. టైఫాయిడ్, డెంగ్యూ పాజిటివ్ అని చెప్పి బోరున ఏడ్చింది. దాంతో హౌస్‌లో వాళ్లంతా వచ్చి ఓదార్చారు. బిగ్ బాస్‌లో సెకండ్ ఛాన్స్ ఎవరికీ రాదు. నాకు వచ్చింది. ఇంత అదృష్టం ఇచ్చి మళ్లీ ఎందుకు ఇంత బ్యాడ్ లక్. నా లైఫ్‌లోనే ఎక్కువగా ప్రేమిస్తానో.. అది నాతో ఉండదు అంటూ తన బాధను పంచుకుంది ఆయేషా.

ఆ తర్వాత ఇతర హౌస్ మేట్స్ ఆరోగ్య భద్రతకి కూడా సహాయ పడుతుంది… అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి బిగ్ బాస్ మీకు అనుమతి ఇస్తున్నాడు అన్నారు. తర్వాత తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్ బాస్.. నాకు సెకండ్ టైమ్ ఛాన్స్ ఇచ్చారు.. ఫ్యూచర్‌లో కూడా ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నాను అని అన్నది ఆయేషా.

Also Read:ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు!

- Advertisement -