మ‌హేశ్ 25 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్…

364
Mahesh_Babu

భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత మ‌హేశ్ బాబు కొంచెం గ్యాప్ తీసుకుని త‌న త‌ర్వాతి సినిమాను ఇటివ‌లే ప్రారంభించాడు. ఈసినిమాకు వంశ‌పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా..దిల్ రాజు, అశ్వినిద‌త్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ డెహ్రాడూన్ లో జ‌రుగుతోంది. ఈమూవీ మ‌హేశ్ కు జోడిగా పూజా హెగ్డె న‌టిస్తుంది. డెహ్రాడూన్ లో సినిమాకు సంబంధించిన కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు.

mahesh 25 movie team

ఈమూవీలో కామెడి హీరో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. ఇక ఈసినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని మ‌హేశ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా సినిమా విడుద‌ల‌పై కొన్ని పుకార్లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇప్పుడు ఆ ప్ర‌చారానికి తెర‌దించారు చిత్ర బృందం. ఈసినిమాను వ‌చ్చే సంవ‌త్స‌రం ఏప్రిల్ 5వ తేదిన విడుద‌ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌న‌ట్లు ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు.

Mahesh Babu

మొద‌ట‌గా సంక్రాంతి ఈసినిమా విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించినా కొన్ని కార‌ణాల వ‌ల్ల రిలీజ్ డేట్ మార్చుకున్నారు చిత్ర‌యూనిట్. మొత్తానికి మ‌హేశ్ సంక్రాంతి బ‌రిలోకి త‌ప్పుకున్న‌ట్టే అని చెప్పుకోవ‌చ్చు. ఈసినిమాలో మ‌హేశ్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా క‌నిపించ‌న‌నున్నాడ‌ని స‌మాచారం. మ‌హేశ్ బాబు ప్రాణ స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం.ఇక ఈమూవీలో మ‌హేశ్ బాబు కొత్త గెట‌ప్ లో క‌నిపించ‌నున్నాడు. మ‌హేశ్ బాబు, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈమూవీపై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు అభిమానులు.