మనం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేయడం ఎంతో అవసరం. అయితే వ్యయమనికి సమయం వెచ్చించలేని వాళ్ళు కనీసం యోగా అయిన చేస్తే ఎంతో మేలు కలుగుతుంది. కాగా యోగా లో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. వాటిలో సులభమైనవి కష్టతరమైనవి ఇలా చాలానే ఉన్నాయి. కాగా కొన్ని ఆసనాలు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు వేయగలిగే విధంగా ఎంతో సులభంగా ఉంటాయి. అలాంటి సులభమైన ఆసనల్లో దండాసనం కూడా ఒకటి. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి అవి ఏంటి ? ఈ ఆసనం ఎలా వేయాలి అనే విషయాలను తెలుసుకుందాం !
దండాసనం వేయు విధానం
చదునైన నేలపై కాళ్ళు ముందుకు చాపి నిటారుగా కూర్చోవాలి. పిరుదుల కింద కొద్దిగా ఎత్తు పెట్టుకొని వెన్నెముక 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. చేతులను ఫోటోలో చూపిన విధంగా పిరుదుల దగ్గర నిటారుగా నెలకు ఉంచాలి. మోకాళ్ళు కచ్చితంగా నేలపై ఆనే విధంగా సమాంతరంగా ఉంచాలి. ఆ తరువాత తొడలు, ఉదర భాగాన్ని బిగుతుగా ఉంచి గట్టిగా ఊపిరి పోలిచ్చుకొని, నెమ్మదిగా వదలాలి. ఇలా వీలైనంతా సమయం చేసి తరువాత యథాస్థితికి రావాలి.
ఉపయోగాలు
దండాసనం ప్రతిరోజూ వేయడం వల్ల వెన్ను సమస్యలు దూరమౌతాయి. అంతే కాకుండా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. భుజల్లో సత్తువ పెరుగుతుంది, మూత్రపిండాలకు మరియు జీర్ణ వ్యవస్థకు ఈ ఆసనం ఒక మంచి వ్యయమంగా పని చేస్తుంది. వెన్నెముక నుంచి మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వార ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దురమౌతాయి. ఏకాగ్రత పెరుగుతుంది.
Also Read:సూపర్ మెన్ ఫోజ్…ఎన్ని లాభాలో!