అల్లుడు శీను, జయ జానకి నాయక లాంటి మాస్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైనమిక్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా “సాక్ష్యం”. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈ చిత్రం టీజర్ ఇవాళ విడుదలైంది. శరత్‌కుమార్, జగపతిబాబు, మీనా, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేయగా తాజాగా ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేయనున్నారు. సౌందర్య లహారి అనే రొమాంటిక్ సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ మూవీ ఐదు భారీ యాక్షన్స్ ఉంటాయని తెలుస్తుంది.
ఇటీవల విడుదలైన చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం.. ఖర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరంటూ అద్భుతమైన డైలాగ్ తో రైటర్ సాయిమాధవ్ బుర్రా వాయిస్ ఓవర్ తో విడుదలైన టీజర్ టెక్నికల్ గా మరియు విజువల్ గా కంటెంట్ పరంగా రిచ్‌గా ఉందన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!