‘జంబలకిడి పంబ’ టీజర్ రిలీజ్…

230
Jambalakidi Pamba Teaser launch
- Advertisement -

శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన తాజా చిత్రం ‘జంబలకిడి పంబ’. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ రొమాంటిక్ కామెడీగా ఉంటుందని సమాచారం.

గతంలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే చిత్రాలో హీరో నటించి మంచి మార్కులు అందుకున్నాడు. సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూనే సోలో సినిమాలు చేస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి. 1993లో ఇదే టైటిల్‌తో వచ్చిన ‘జంబలకిడి పంబ’ ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీతో ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలిసిందే. అదే టైటి్‌తో మరోసారి ప్రయోగానికి రెడీ అయ్యింది ‘జంబలకిడి పంబ’. ఈ సినిమా కేరళ, ఈస్ట్ గోదావరి, హైదరాబాద్ ప్రాంతాలలో షూటింగ్ చిత్రం షూటింగ్‌ను జరుపుకుంది.

కామెడీకి అధిక ప్రాధాన్యతనిస్తూ రూపోందించిన ఈ సినిమాలో టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది ముంబై మోడల్ సిద్ది ఇచ్చానీ. అయితే ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ను విడుదల చేసింది చిత్రి యూనిట్. పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డికి సంబంధించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.

- Advertisement -