చిరు….సమ్మోహనం

232
Hero Asked Chiru To Do A Love Story
- Advertisement -

సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర టీజర్‌ను డల్లాస్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు…కాసేపు చిరంజీవితో ముచ్చటించారు. ఈ సందర్భంగా సమ్మోహనం సూపర్ హిట్ కావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

సుధీర్ : ‘సమ్మోహనం’ టైటిల్ చెప్పగానే మీకేం గుర్తొస్తుంది సర్
చిరు : ‘సమ్మోహనం’ అనగానే సరెండర్ ,ఇంకొక రకంగా మెస్మరైజింగ్ . ఫ్లాట్ అయిపోతున్నామనే ఫీలింగ్ వచ్చింది
సుధీర్ : పర్సనల్ క్వశ్చన్ సర్ …. సురేఖ గారిని చూసి మీరు సమ్మోహితులు అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
చిరు : (నవ్వుతూ) సురేఖని చుసిన ఫస్ట్ లుక్ లోనే నేను సమ్మోహితుడు అయ్యాను
సుధీర్ : అప్పట్లో రుద్రవీణ, ఆరాధన లాంటి అచ్చ తెలుగు టైటిల్ పెట్టేవారు..కానీ ఈ మధ్యకాలంలో తెలుగు టైటిల్స్ మిస్ అయ్యాం..మీకేలా అనిపిస్తుంది.
చిరు : మొన్న రంగస్థలం, నిన్న భరత్ అనే నేను, రేపు సమ్మోహనం…టైటిల్స్‌ ఆ కాలాన్ని గుర్తుచేస్తున్నాయి
సుధీర్: ఇంద్రగంటి గారి సినిమాలు ఏమైనా చూసారా మీరు ?
చిరు : యా ! ఆయన గురించి గొప్పగా విన్నాను.ఇటీవల ఆయన తీసిన సినిమా “అమీ తుమీ ” మా ఫ్యామిలీ తో చూశాను.

Hero Asked Chiru To Do A Love Story

చిరు:ఇంతకు కథ ఏంటి ?
సుధీర్ : ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక ఫిలిం స్టార్ మధ్య జరిగే లవ్ స్టోరీ.
చిరు : స్టోరీ ఇంద్రగంటి గారిదే కదా
సుధీర్: ఇంద్రగంటి గారిదే సర్ ! ఇంద్రగంటి గారు గోల్కొండ హై స్కూల్ టైం లో ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీ రాశారు.
చిరు : ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మీ అందరికి మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను.

- Advertisement -