40 ముద్దులకు యు/ఎ సర్టిఫికెట్….

305
- Advertisement -

ఈ మధ్య కాలంలో సెన్సార్ బోర్డ్ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. కొన్ని సినిమాలకు విపరీతంగా కట్స్ ఇవ్వటం. కొన్ని సినిమాలకు చూసి చూడనట్టుగా వదిలేస్తుండటంతో సెన్సార్ బోర్డ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు ఒక్క ముద్దు సన్నివేశానికి ఎ సర్టిఫికెట్ ఇచ్చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 40 ముద్దులున్న సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యమే. అంతే కాదు.. సినిమాలో ఒక్కటంటే ఒక్క ముద్దు సన్నివేశానికి కూడా కోత పడలేదు.

Befikre movie u/a certificate
ఇదంతా బేఫికర్ సినిమా విషయంలో చోటు చేసుకుంది. ప్రముఖ దర్శక నిర్మాత ఆదత్య చోప్రా రూపొందిస్తున్న ఈ సినిమా మొదటి నుంచి శృంగార సన్నివేశాలతోనే వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నెల రోజులకు ఒక్కో రకమైన ముద్దున్న పోస్టర్ రిలీజ్ చేస్తూ.. దాదాపు పది నెలల నుంచి ఈ సినిమాను వెరైటీగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు ఆదిత్య చోప్రా.

Befikre movie u/a certificate

ఐతే కొన్ని నెలల ముందు వరకు సెన్సార్ బోర్డు చాలా కఠినంగా ఉండేది. జేమ్స్ బాండ్ సినిమాలో ముద్దు లెంగ్త్ తగ్గించడం.. ‘ఉడ్తా పంజాబ్’ సినిమాకు 80కి పైగా కట్స్ చెప్పడం లాంటి చర్యలతో తీవ్ర దుమారం రేగడం.. సెన్సార్ బోర్డుకు కోర్టు పంచ్ ఇవ్వడం లాంటి పరిణామాలతో పరిస్థితి మారింది. ఈ మధ్య సెన్సార్ బోర్డు బాగా లిబరల్ అయిపోయింది. ముందు ముందు సినిమాలో అసలు కోతలే ఉండవని కూడా అంటున్నారు.

Befikre movie u/a certificate
అయితే బేఫికర్ సినిమాకు కట్స్ ఏమీ ఇచ్చినట్లు లేదు. కట్స్ ఇవ్వకపోయినా.. అన్నేసి ముద్దులున్న సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడమే ఇండస్ట్రీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఈ సినిమాలో ముద్దులతో పాటు ఇంటిమేట్ సీన్లు.. అర్ధనగ్న సన్నివేశాలు చాలానే ఉన్నాయని ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. రణ్వీర్ సింగ్.. వాణికపూర్ జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -