డిసెంబర్‌లో విశాల్‌ ‘ఒక్కడొచ్చాడు’

253
- Advertisement -

మాస్‌ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒక్కడొచ్చాడు’. నవంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాత జి.హరి ప్లాన్‌ చేస్తున్నారు.

tamanna
నిర్మాత జి.హరి మాట్లాడుతూ – ”ప్రస్తుతం దేశంలో నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా ఈనెలలో విడుదల చెయ్యాల్సిన మా ‘ఒక్కడొచ్చాడు’ చిత్రాన్ని వాయిదా వెయ్యడం జరిగింది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది” అన్నారు.

Okkadochadu
విశాల్‌, తమన్నా, ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు, సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా.చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె. సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.

- Advertisement -