బీట్ రూట్ తో ఎన్ని ఉపయోగాలో..!

70
- Advertisement -

బీట్ రూట్ గురించి మనందరికి తెలిసే ఉంటుంది. శరీరంలో రక్తకణాలను రుద్ది చేసే కూరగాయలలో బీట్ రూట్ ఒకటి. కొంతమంది దీనిని ఎంతో ఇష్టంగా తింటే మరికొందరేమో బీట్ రూట్ తినడానికి అసలు ఆసక్తి చూపరు. ఎందుకంటే దీనితో వంట చేసేటప్పుడు వచ్చే డార్క్ పింక్ కలర్ కారణంగా అలాగే దాని నుంచి వచ్చే వాసన కారణంగా బీట్ రూట్ తినడానికి ఇష్టపడరు. అయితే దీనిని తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే అసలు తినకుండా ఉండలేరు. ఒకవేళ తినడానికి అయిష్టంగా ఉన్నవారు కనీసం జ్యూస్ చేసుకొని తాగాలని నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్ లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పుష్కలంగా ఉంటాయి.

అంతేకాకుండా విటమిన్ ఏ, సి, ఇ వంటివి కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే పలు రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా హైబీపీ ఉన్నవారికి బీట్రూట్ జ్యూస్ ఒక దివ్యఔషధంలా పని చేస్తుంది. రక్తనాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. ఐరన్ లోపం ఉన్నవాళ్ళు, రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు డైలీ బీట్రూట్ జ్యూస్ తాగితే ఆ సమస్యలను త్వరగా అదిగమించవచ్చు.

Also Read: Review 2023: ఫ్లాపైన రీమేక్ సినిమాలు

ఇంకా జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా బీట్రూట్ జ్యూస్ చక్కగా ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా ఇందులో వుండే విటమిన్స్ మరియు మినరల్స్ వివిధ రకాల చర్మ సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఇంకా ఇందులో ఉండే కాల్షియం ఎముకలను శక్తివంతంగాను దృఢంగాను తయారు చేస్తుంది. ఇక గర్భిణీలు ప్రతిరోజూ బీట్ రూట్ జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కడుపులో బిడ్డకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ ను బీట్ రూట్ మెండుగా అందిసుందట. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు ఉన్న బీట్రూట్ జ్యూస్ తప్పనిసరిగా తాగాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

 

- Advertisement -