కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన కొత్త చిత్రం ‘బీస్ట్’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు తెలుగులో విడుదలైంది. ‘కోలమావు కోకిల,
డాక్టర్` చిత్రాలతో కోలీవుడ్‌లో దర్శకుడిగా నిరూపించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు పాజిటివ్ టాక్ రావడంతో ‘భీస్ట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఏలా ఉందో చూద్దాం..
కథ:
వీర రాఘవ (విజయ్) ఒక రా ఏజెంట్. దేశం కోసం ఎన్నో సాహసోపేత ఆపరేషన్లలో పాల్గొన్న అతను.. ఉమర్ ఫరూక్ అనే పెద్ద ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో చేపట్టిన ఆపరేషన్లో ఓ చిన్నారి చనిపోవడంతో మనసు వికలం అయి తన ఉద్యోగాన్ని విడిచిపెడతాడు. తాను తప్పు చేశానన్న అపరాధ భావం వెంటాడుతున్న సమయంలో అతను ఒక సెక్యూరిటీ కంపెనీలో ఉద్యోగానికి చేరి చెన్నైలోని ఒక షాపింగ్ మాల్ లో సెక్యూరిటీ కాంట్రాక్టు కోసం దక్కించుకోవడం కోసం తన యజమానితో కలిసి అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో ఉగ్రవాదులు ఆ మాల్ ను హైజాక్ చేసి అక్కడున్న అందరినీ బందీలుగా తీసుకుంటారు. మరి ఆ స్థితిలో వీర రాఘవ ఏం చేశాడు.. అతను బందీలందరినీ కాపాడాడా లేదా అన్నది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
విజయ్ సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. డ్యాన్సుల్లో.. ఫైట్లలో ఆకట్టుకున్నాడు. విజయ్ సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. డ్యాన్సుల్లో.. ఫైట్లలో ఆకట్టుకున్నాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. స్టైలింగ్ కూడా బాగా చేశారు. సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.వీటీవీ గణేష్ సినిమాలో పెద్ద రిలీఫ్ అని చెప్పాలి.
మైనస్ పాయింట్స్:
డ్రామా లేదు.. కామెడీకి స్కోప్ లేదు.. పూర్తిగా ఓవర్ ద టాప్ హీరోయిజం ‘బీస్ట్’ను సిల్లీ సినిమాగా మార్చేశాడు నెల్సన్. పతాక సన్నివేశాలైతే మరీ టూమచ్. ‘బీస్ట్’కు అతి పెద్ద మైనస్.. హీరోయిన్ పూజా హెగ్డే. తన కెరీర్లోనే ఇందులో చేసింది అత్యంత పేలవమైన పాత్ర అనడంలో మరో మాట లేదు. అరబిక్ కుత్తు పాటను పక్కన పెడితే.. ఆమెది సినిమాలో సైడ్ క్యారెక్టర్ టైపు అని చెప్పొచ్చు. యోగిబాబును దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు.
సాంకేతిక విభాగం:
అనిరుధ్ సంగీతంతో న్యాయం చేశాడు. అరబిక్ కుత్తు.. బీస్ట్ మోడ్.. సినిమా పూర్తయ్యాక వచ్చే జాలీయో జింఖానా.. ఈ మూడు పాటలూ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం కూడా బాగుంది. విజువల్స్ ఆద్యంతం మెప్పిస్తాయి. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు.
తీర్పు: బీస్ట్.. రోటీన్ యాక్షన్
విడుదల తేదీ:13/04/2022
రేటింగ్:2.5
నటీనటులు: విజయ్-పూజా హెగ్డే
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: కళానిధి మారన్
రచన-దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్