రాష్ట్రపతిని కలిసిన రాహుల్ గాంధీ..

40
rahul

రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ను కలిశారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతలు రాహుల్, అధిర్‌ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్‌.నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన 2 కోట్ల సంతకాల పత్రాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్రపతికి అందజేశారు రాహుల్‌ గాంధీ.

కూలీలు, రైతులు, వ్యాపారుల నుంచి 2 కోట్ల సంతకాలు సేకరించిన కాంగ్రెస్ పార్టీ.సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోవింద్‌ను అభ్యర్థించింది కాంగ్రెస్ ప్రతినిధుల బృందం.రైతుల సమస్యలను రాష్ట్రపతికి వివరించామని తెలిపారు రాహుల్ గాందీ.కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామని…కేంద్రం రైతులను మోసం చేస్తోంది.ప్రధాని రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నిరసన తెలిపిన ఆటంకవాదులుగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు.

కేవలం ముగ్గురు, నలుగురు కార్పొరేట్ల కోసం దేశ రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోకపోతే దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.రైతు సమస్యలపై చర్చకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి…..రైతులు, కార్మికుల పక్షాన విపక్ష పార్టీలు నిలబడతాయన్నారు.