మహిళా క్రికెటర్ల పారితోషికాలపై BCCI

6
- Advertisement -

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) డిసెంబర్ 22న జరిగే ఏపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మహిళా క్రికెటర్ల దేశీయ మ్యాచ్ ఫీజులపై సమీక్ష నిర్వహించనుంది. భారత మహిళల జట్టు ఇటీవల సాధించిన అద్భుతమైన ODI వరల్డ్ కప్ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ సవరణ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సమావేశం వర్చువల్‌గా నిర్వహించబడనుంది.

అంతర్జాతీయ స్థాయిలో పురుషులు–మహిళలకు ఒకే మ్యాచ్ ఫీజు అమలులో ఉన్నప్పటికీ, దేశీయ క్రికెట్‌లో మాత్రం ఇప్పటికీ భారీ తేడాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మహిళా క్రికెటర్ల పారితోషికాలను పెంచే దిశగా BCCI ముందడుగు వేయనుందని తెలుస్తోంది.

ఇక మరో ముఖ్య అంశం పురుషుల జట్టుకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టులు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ మూడు ఫార్మాట్లలో రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన నేపథ్యంలో వీరికి ఏ గ్రేడింగ్‌పై కేటాయిస్తారు అనేదానిపై ఆసక్తి నెలకొంది.

అదేవిధంగా అంపైర్లు, మ్యాచ్ రిఫరీల పారితోషికాలను కూడా సవరించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశం కూడా డిసెంబర్ 22 సాయంత్రం 7 గంటలకు జరిగే సమావేశంలో చర్చకు రానుంది.

Also Read:ఏపీకి పెట్టుబడులే టార్గెట్‌గా లోకేష్ టూర్‌

- Advertisement -