ఐపీఎల్‌ ఫ్రాంచైజీల వేలానికి బీసీసీఐ…

371
- Advertisement -

భారత క్రికెట్‌ చరిత్రలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే యేడాది మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీ 2023మార్చి నుంచి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది.

బీసీసీఐ ఇందుకోసం కసరత్తులు ముమ్మరం చేసింది. తాజాగా ఇందు కోసం ఫ్రాంచైజీల కోసం త్వరలో పోటీ నిర్వహించనున్నారు. ఇందుకుగాను ఒక్కో ఫ్రాంచైజీ కోసం కనీసం రూ.400కోట్లగా నిర్ధారించారు. మహిళల క్రికెట్‌కు ఉన్న ఆదరణ అభిమానం ఇతర అంశాలను బేరీజు వేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ప్రకటించింది.

ఫ్రాంచైజీల అమ్మకాల ద్వారా కనీసం రూ.6,000 కోట్ల నుంచి రూ.8,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ అంచనా. ప్రతి జట్టు కనీసం రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు అమ్ముడుపోవచ్చని భావిస్తోంది. ఈసారి ఏ సంస్థలు ఫ్రాంచైజీల కోసం పోటీ పడతాయి.. ఏయే జట్లు పోటీలో ఉంటాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి…

ఇండియాకు ఫస్ట్‌ ‘గే’ జడ్జ్‌..!

రూ.200 కోట్ల నిధులతో కంటివెలుగు-2

కూలీగా మారిన చాహల్‌

- Advertisement -