ఒమిక్రాన్ విజృంభిణ.. టీమిండియా టీ20 వాయిదా..

82

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఈ వైరస్‌ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు ఎలా ఉన్నా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుందని తెలిపారు. అయితే మూడు టీ20ల సిరీస్ ను మాత్రం వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. టీ20 సిరీస్ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభమవుతుంది.