గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు: బిసి సంఘాలు

43
gellu

హుజురాబాద్ అభ్యర్థిగా బిసిలకు అవకాశం ఇచ్చినందుకు…సీఎం కేసీఆర్, మంత్రి గంగులకు క్రుతజ్ణతలు తెలిపారు బిసి సంఘాల నేతలు. మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో మీడియాతో మాట్లాడారు బీసీ సంఘాల నేతలు. ఈ సమావేశంలో రజక, కుమ్మరి,యాదవ, నాయీభ్రాహ్మణ, మేరు, సగర అన్ని బిసి సంఘాల నేతలు పాల్గొనగా రాబోయే హుజురాబాద్ ఎన్నికల్లో బేషరతుగా టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు.

బిసిల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఓపెన్ నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించడం కేసీఆర్ బిసి పక్షపాతానికి నిదర్శనం అన్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా వస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అభినందనలు తెలిపారు.