బీసీ నేతకు అవకాశమిచ్చిన సీఎంకు ధన్యవాదాలు: తలసాని

77
ts

హుజురాబాద్‌ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి తలసాని. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని… గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పోరాడిన నాయకుడు అని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి గెల్లు…. బహుజనుల బిడ్డ గెల్లును పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం – యువతకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం అన్నారు.

సామాజిక న్యాయం చేయాలని ముఖ్యమంత్రి భావించడం బీసీల అభివృద్ధికి నాంది అన్నారు. హుజురాబాద్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి…. ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వ్యక్తి అన్నారు. బీజేపీ హుజురాబాద్ లో గెలిస్తే రెండు కాస్త- మూడు అవుతాయి…. హుజురాబాద్ లో బీజేపీ గెలిస్తే ప్రజలకు ఒరిగేది ఏమీలేదన్నారు.

గెల్లు శ్రీనివాస్ గెలుస్తే పెండింగ్ అభివృద్ధి అంతా పూర్తి అవుతుందన్నారు. నాగార్జున సాగర్ ఫలితాలే రేపు హుజురాబాద్ లో రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. సర్వేలన్ని టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని…. కొంతమంది పనికిరాని దద్దమ్మలు దళితబంధు పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గొర్ల పంపిణీ ప్రోగ్రాం రాష్ట్రంలో ఎక్కడ అమలు కావడంలేదో చెప్పాలి?.. జైలుకు వెళ్లిన వ్యక్తులే- జైళ్ల గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు.

హైదరాబాద్ లో పుట్టిపెరిగింది మేము- మా కంటే బలవంతుడు ఎవడు ఉంటాడు… విమర్శలు చెయ్యాలంటే అంతటి వ్యక్తిత్వం ఉండాలన్నారు. చిన్న చిన్న పార్టీలు పెడితేనే జనాలు వస్తున్నారు- జనాలు రాగానే ఊగిపోవద్దని.. మున్సిపల్ ఎన్నికల్లో గప్పాలు కొట్టిన బీజేపీ నేతలు ఎక్కడ పోయారు? అని ప్రశ్నించారు. మేము కూడా అన్ని విధాలుగా మాట్లాడగలుగుతాం…. తాటాకు చప్పుళ్లకు భయపడే రోజులు పోయాయన్నారు.టీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి.. ప్రతి పథకాన్ని విమర్శ చేయడం అలవాటు అయిందన్నారు.