బీసీ కమిషన్ సభ్యుల ప్రమాణస్వీకారం..

311
bc commission
- Advertisement -

ఖైరతాబాద్ లోని బిసి కమిషన్ కార్యాలయం లో బిసి కమిషన్ చైర్మన్ వకళాభరణం కృష్ణమోహన్ , కమిషన్ సభ్యులుగా శుభప్రద్ పటేల్ , సిహెచ్ ఉపేందర్ , కిషోర్ గౌడ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిధిలు గా హాజరయ్యారు మంత్రి గంగుల కమలాకర్ , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్,మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ , సంగీత నాటక రంగ చైర్మన్ బాద్మి శివకుమార్ , టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ వకళాభరణం కృష్ణమోహన్ రావు మట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బిసి కమిషన్ ఛైర్మన్ నియమించినందుకు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమదైన ముద్ర వేసుకొని ముందుకు వెళ్లిన శుభప్రద్ పటేల్ , కిషోర్ గౌడ్ , ఉపేందర్ గౌడ్ లకు బిసి కమిషన్ లో సభ్యులు గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ శాశ్వత పేద సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం పరితపిస్తుందన్నారు. బిసి లు అభ్యున్నతికి కృషి చేస్తూ ముందుకు వెళ్తాము… కమిషన్ పరిధిలో ఉన్న అన్ని చట్టలను క్రమ పద్ధతిలో ప్రజల అర్జీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బిసి కమిషన్ ముందుకు కదులుతుందన్నారు.

- Advertisement -