ఆది…అతిథి దేవోభవ

128
sai

ఆది సాయి కుమార్ హీరోగా శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సినిమా టైటిల్ , ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. సినిమాకి “అతిథి దేవోభవ” అనే టైటిల్ ఖరారు చేశారు.

ఫస్ట్ లుక్ టైటిల్‌ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తికాగా అతిథి దేవోభవ రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటించనున్నారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా, అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆది సాయికుమార్ ఖాతాలో బ్లాక్, అమరన్, కిరాతక, అతిథి దేవోభవ సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏ సినిమాతో హిట్ అందుకుంటాడో వేచిచూడాలి.