మరో నాలుగు మండలాల్లో దళితబంధు..

177
kcr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం దళితబంధు. పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలుచేయనుండగా ఇందుకోసం దశలవారీగా రూ. 2000 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక కోసం సర్వే జరుగుతుండగా తాజాగా మరో నాలుగు మండలాల్లో దళితబంధును అమలుచేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం,తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం,జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాలను ఎంపిక చేసింది. ఈ 4 మండలాల్లో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. త్వరలోనే ఈ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో సమావేశమై విధివిధానాలను ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్.

- Advertisement -