BB6..కెప్టెన్‌గా శ్రీసత్య..

251
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 61 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా శ్రీసత్య ఈ వారం కెప్టెన్‌గా నిలిచారు.ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడకొట్టి రకరకాల టాస్కులు ఇచ్చారు. ఆదిరెడ్డి టిషర్ట్ ని కొట్టేయగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఇక కంటెస్టెంట్స్ డైరెక్ట్ గా కొట్టుకోగా ఇందులో ఇనయా అవతల టీం వాళ్ళని కొట్టడానికి ట్రై చేయగా రేవంత్ ఆమెని పడేశాడు. దీంతో ఇనయా ఏడుస్తూ అందరూ నన్ను కావాలని టార్గెట్ చేశారు అని కాసేపు అరిచింది. ఈమె అరుపులకి ఎప్పటిలాగే శ్రీహన్ కౌంటర్లు వేశాడు.

తర్వాత బిగ్‌బాస్‌‌ కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ గీతూకు క్లాస్ ఇచ్చి ఆదిరెడ్డిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించాడు. దీంతో తర్వాత గీతూ … ఆదిరెడ్డికి సారీ చెప్పింది. మిషన్ ఇంపాజిబుల్ అనే టాస్క్ లో రెండు టీమ్స్ ఈక్వల్ స్కోర్ చేయగా టై అవ్వడంతో ఫైనల్ టాస్క్ పోటీకి ఎవర్ని పంపిస్తారో మీరే తేల్చుకోండి అని రెండు గ్రూపులకి సూచించారు బిగ్ బాస్.

రెండు టీంల నుంచి శ్రీసత్య, ఇనయ, మెరీనా, ఫైమా, వాసంతి, గీతూలు ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనగా చివరిగా ఈ టాస్క్ లో శ్రీసత్య గెలిచి ఈ వారం కెప్టెన్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి..

 

 

- Advertisement -