మొక్కలు నాటిన BB6 శాని

87
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతొంది. జూబ్లీహిల్స్‌లోని ప్రశసన్‌నగర్‌లో బిగ్‌బాస్‌6 కంటెస్టెంట్‌ శాని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా శాని మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతీ ఇంట్లో వారసత్వాన్ని ఎలా అయితే పెంచుతామో మొక్కలను కూడా అలా పెంచవలసిన భాద్యత ఎంతయినా ఉంది అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటితే రేపటి తరాలకు ఆక్సీజన్ కానీ, ఫలాలు గానీ ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయన్నారు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ఒక మహా యజ్ఞంలా ముందుకు సాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రతీ ఇంట్లో మొక్కలు నాటాలని ఎప్పుడు చెప్తూ ఉంటారని…ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగిపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా చలాకి చంటి, అభినవ్ సర్ధార్, నటి వినిత, నటి లతా రెడ్డి, నటి నవీన జాక్సన్ వీరిని ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -