BB 6..కెప్టెన్సీ కోసం బ్యాటరీ టాస్క్

104
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 36 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య కెప్టెన్సీ టాస్క్ కోసం మెంటల్ టాస్క్ పెట్టారు. హౌస్‌లో ఓ పెద్ద బ్యాటరీని పెట్టాడు. దానికి హండ్రెడ్ పర్సెంట్ చార్జింగ్ ఉంది. ఇంట్లో వాళ్లకి కొన్ని సర్‌‌ప్రైజ్‌లు రెడీగా ఉన్నాయని, సర్‌‌ప్రైజ్ యాక్సెప్ట్ చేసిన ప్రతిసారీ కొంత చార్జింగ్ తగ్గిపోతుందని చెప్పిన బిగ్‌బాస్.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలవడం స్టార్ట్ చేశాడు. ఎపిసోడ్ ముగిసే సరికి బ్యాటరీలో ఐదు శాతమే మిగలగా ఇవాల్టి ఎపిసోడ్‌లో తిరిగి చార్జ్ చేసుకోడానికి అవకాశం ఇవ్వనున్నాడు బిగ్ బాస్.

ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా తొలుత శ్రీహాన్‌ని పిలవగా ఇంట్లోవాళ్లు వండిన బిర్యానీ, నాన్నతో వీడియో కాల్, సిరితో ఆడియో కాల్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. అన్నిటికంటే తక్కువ పర్సంటేజ్ ఫుడ్‌కి పెట్టాడు. తర్వాత సుదీప ముప్ఫై, ముప్ఫై అయిదు, నలభై పర్సెంట్ పెట్టగా ఆడియో కాల్ అన్నింటికంటే తక్కువ ఉండటంతో దాన్ని తీసుకుంది. తర్వాత తన భర్త కాల్ చేయడంలో సంతోషంలో మునిగిపోయింది సుదీప.

శ్రీహాన్, సుదీపల తర్వాత ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్. అప్పటికి బ్యాటరీ నలభై అయిదు శాతం ఉండగా మీ పాప ఉన్న టీషర్ట్కి ముప్ఫై, ఆడియో కాల్‌కి ముప్ఫై అయిదు, భార్యా పాపలతో వీడియో కాల్ మాట్లాడ్డానికి నలభై శాతం చార్జింగ్ త్యాగం చేయాలని చెప్పగా వీడియో కాల్ తీసుకుంటాను అని చెప్పాడు. దాంతో నలభై శాతం ఎగిరిపోయి ఫైవ్ పర్సెంట్ మాత్రమే చార్జింగ్ మిగిలింది. తర్వాత అతని భార్య, పాప ఫోన్ చేసినప్పుడు అందరూ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు.

- Advertisement -