BB6..వరస్ట్ సీజన్ ఇదే!

105
BB6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 45 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు క్లాస్ పీకారు బిగ్ బాస్. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరస్ట్ పర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నారని…అసలు మీరు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ గేట్లు తెరచి…ఇంటి నుండి వెళ్లిపోవాలని సూచించారు.

బిగ్ బాస్ ఆదేశాలు అంటే నిర్లక్ష్యం.. టాస్క్‌ల పట్ల నిర్లక్ష్యం.. మీ నిర్లక్ష్యం బిగ్ బాస్‌నే కాకుండా ప్రేక్షకుల్ని కూడా నిరాశపరిచింది. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఈ టాస్క్‌లను రద్దు చేస్తున్నాం అని తెలిపారు.

ఇక తర్వాత ఎవరి పర్ఫామెన్స్ వారు ఇచ్చారు. బిగ్ బాస్ అందర్నీ కలిపి తిడితే..ఎవరికి వారు తాము మాత్రమే ఆడుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఆర్జే సూర్య ‘మనం ఎంత ప్రయత్నం చేసినా.. మిగిలిన వాళ్ల వల్ల అది ఆగిపోతే చాలా పెయిన్ ఉంటాది అక్కా అని ఏడ్చేశాడు.

ఇక గీతు.. పది మంది దోషులకు శిక్షపడినా పర్లేదు కానీ.. ఒక నిర్దోషికి శిక్షపడకూడదు బిగ్ బాస్ అని చెబుతుంది. హౌస్‌లో ఉన్న ఓ ఐదురుగు వేస్ట్ కోటాలో పెట్టడంతో ఇనయ ఏడుపు మొదలుపెట్టింది.

- Advertisement -