బయ్యారం ఉక్కు..తెలంగాణ హక్కు: ఎంపీ నామా

174
nama
- Advertisement -

బయ్యారం ఉక్కు…తెలంగాణ హక్కు అన్నారు ఎంపీ నామా నాగేశ్వరావు. ఇదే అంశంపై లోక్ సభలో కేంద్రాన్ని నిలదీస్తామని తెలిపారు నామా. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో టీఆర్‌ఎస్‌ నిరసన దీక్ష చేపట్టగా ఈ సందర్భంగా మాట్లాడిన నామా… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయమంత్రి నుంచి క్యాబినెట్‌ మంత్రిగా ఎదిగినా ఇంకా నిస్సహాయ మంత్రిగానే ఉన్నార ఎద్దేవా చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కిషన్‌రెడ్డి చెప్పింది సొంత అభిప్రాయమా? కేంద్ర ప్రభుత్వ విధానమా? అని నిలదీశారు మంత్రి పువ్వాడ.

ఉక్కు పరిశ్రమ వస్తే ఉద్యోగాలు లభిస్తాయని స్థానిక గిరిజనులు, ఇతరులు ఆశగా ఎదురుచూశారని, వారి ఆశలపై కిషన్‌రెడ్డి నీల్లు చల్లారని మండిపడ్డారు. ఈ దీక్షలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, శంకర్ నాయక్, రేగా కాంతారావు, రెడ్యానాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జడ్పీ చైర్మన్ బిందు పాల్గొన్నారు.

- Advertisement -