దుబాయ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

510
gulf batukamma
- Advertisement -

గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్(GTWCA) వారి ఆధ్వర్యంలో దుబాయ్ లో మన తెలంగాణ సంప్రదాయాలని గౌరవిస్తూ 12 వ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ,ఆడపడుచుల ఉత్సాహం, జోష్ అద్భుతం, ఇండియా నుండి వచ్చిన సాయిచంద్ మరియు రజనీ అట పాటల తో సాంప్రదాయ బతుకమ్మ పాట ల తో దుబాయ్ లోని ఆల్ అహ్లి స్టేడియం మార్మోగింది.

తెలంగాణ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలు విజయవంతం చేసినారు. బతుకమ్మను అందంగా పేర్చిన దీపికా పట్టు చీర బహుమతి గెలుచుకుంది . .ఈ కార్యక్రమంలో శ్రీదేవి , దీపికా , సరితా , ప్రియా , పాల్గొన్నారు ,గల్ఫ్ తెలంగాణ కార్యవర్గం అందరికి భోజన వసతులు ఏర్పాటు చేసినారు , అన్ని ఎమిరెట్స్ నుండి తెలంగాణ కుటుంబాలు, ఐక్యవేదిక లో పనిచేస్తున్న ప్రతినిధులు ఈ వేడుక ల లో పాల్గొన్నారు .

- Advertisement -