తాను రాహుల్ గాంధీ వెంటే ఉంటానని తెలిపారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలంగాణ నుండి కీలకనేతలు రాహుల్ గాంధీని కలిసేందుకు వెళ్లగా భట్టి విక్రమార్క మాత్రం వెల్లలేదు. దీంతో పలు ఊహాగానాలు వెలువడగా దీనిని ఖండించారు భట్టి.
తాను రాహుల్ వెంటే ఉంటానని…తాను పాదయాత్రలో ఉన్నందున రాలేకపోతున్నానని అధిష్టానానికి వెల్లడించారు. ఇక ఇవాళ రాహుల్ గాంధీ నిర్వహించిన నిరసనకు భట్టి విక్రమార్క మద్దతు తెలిపారు. చింతకాని మండలం పాతర్ల పాడులో భట్టి విక్రమార్క పాదయాత్రలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి మహిళలు చావు డప్పు మోగించారు.
రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు పెనుభారంగా మారింది. గత 10 రోజుల్లో 9 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగగా ధరల పెంపును నిరసిస్తూ రాహుల్ గాంధీ ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు, సీనియర్ నాయకులు, వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.