పార్టీ విధేయతకు, నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం భట్టి విక్రమార్క మల్లు. క్రమశిక్షణకు మారు పేరు, పార్టీ పట్ల అంకితభావం, కష్టపడే మనస్తత్వం కలిగిన విక్రమార్క ఎన్ ఎస్ యు ఐ కార్యకర్త నుంచి అంచలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు.తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మండుటెండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనదైన పాత్రను పోషించారు.ఎమ్మెల్సీగా గెలుపొంది చీఫ్ విప్పుగా, డిప్యూటీ స్పీకర్గా, సీఎల్పీ నేతగా సమర్థవంతమైన పరిపాలన అనుభవం సాధించి సీఎం స్థాయి వరకు ఎదిగినప్పటికీ పార్టీ అధిష్టానానం డిప్యూటీ సీఎం గా ఇచ్చిన బాధ్యతను అంగీకరించిన విధేయుడు.
ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిర శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగోసారి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2009, 2014, 2018, 2023 ఎన్నికలలో శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2007లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. విక్రమార్క 2009 నుండి 2011 వరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్నారు. 2011 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు,
భట్టి రాజకీయ జీవితం ఎన్ఎస్ యుఐ కార్యకర్త నుంచి ప్రారంభమైంది. భట్టి సోదరులు దివంగత నేత మల్లు అనంత రాములు గారు కాంగ్రెస్ పార్టీలో చిరకాలం సేవలు అందించారు. వారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులుగా, ఎఐసిసి కార్యదర్శిగా పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు.వారి ఆకాంక్షలను కొనసాగిస్తూ.. రాజకీయ అరంగ్రేటం చేసిన భట్టి గత నాలుగు దశాబ్దాలుగా పార్టీలో కార్యకర్త స్థాయి నుండి నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎదిగారు.అధిష్టానం మాటనే పరమవిదిగా పాటిస్తూ నేడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాడానికి అన్ని అర్హతలు ఉన్న నేత భట్టి విక్రమార్క అధిష్టానం అభీష్టం మేరకు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు
రాష్ట్రంలో వైఎస్సార్ గారి తర్వాత పాదయాత్ర చేసి అంతా ప్రజాదరణ పొందిన నాయకుడు భట్టి విక్రమార్క రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల గురించి అవగాహనతో పాటు రాష్ట్ర వనరుల పైన, రైతంగాం సమస్యల పైన, తాడిత పీడిత అణగారిన వర్గాల స్థితిగతులు, భూ నిర్వాసితులు, విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పనలో మరియు ఇతర అన్ని రంగాల పైన అపారమైన అనుభవం, తెలివి గల నాయకుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ విలువలకు కట్టుబడి క్రమశిక్షణ గల నాయకుడుగా ఆదర్శంగా నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకంగా వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలకు భట్టిని మరింత దగ్గర చేసింది నాడు భట్టి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నపుడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పై శాసన సభ/ శాసన మండలి లో సంతకం చేసి ఆమోద ముద్ర వేసిన ఘనత భట్టి విక్రమార్కది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు.
గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ అసెంబ్లీ లో ప్రశ్నించడం తో పాటు వారి విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిన నాయకుడు భట్టి విక్రమార్క.
2018 ఎన్నికలో 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు నాడు తెరాస పార్టీలో చేరినప్పుడు కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలను, నాయకులను కాపాడుకుంటూ వచ్చిన నాయకుడు భట్టి.
రైతు సమస్యలు, ప్రజారోగ్యం, విద్యా సహా అన్ని రకాల సమస్యలపై దశాబ్ద కాలంగా కేసీఆర్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో రాజీ లేకుండా పోరాటం నిర్వహించారు.
2015లో నకిలీ విత్తనాల సమస్యపై రాష్ట్ర స్థాయి ఉద్యమం నడిపారు.
2016లో నిజామాబాద్ లో పసుపు రైతులు చేసిన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు.. సంఘీభావం
కరోనా మొదటి వేవ్ లో ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇంటి నుంచి బయటకు రాని వంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో 2017లో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి కరోన రోగులను పరామర్శించి మనో స్థైర్యం కల్పించారు.
2018లో రైతుల ఉద్యమాలు.. మానవహారాలు..
2019 – 20లో కరోన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు
2021లో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు రైతులతో ముఖాముఖి కార్యక్రమం
రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో పాదయాత్ర దేశమంతా విజయవంతం అవ్వడంతో రాష్ట్రంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టి ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు అలుపెరగని బాటసారిగా 1365 కిలోమీటర్లు, 109 రోజులు పాదయాత్ర చేసి పార్టీ కార్యకర్తలో దైర్యం నింపడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించే విధంగా తన పాదయాత్ర చేసి, రైతులను, మహిళలను, యువకులను, వృద్ధులను, యువకులను, పేద వారిని, అణగారిన, బలహీన, మైనార్టీ, వెనుకబడిన వర్గాల ప్రజలందరినీ కలిసి వారి కష్టాలను విని వారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్య స్థాపనలో వారికి సంక్షేమ పథకాలతో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది అని అన్ని వర్గాల ప్రజలకు వివరించి చెప్పి వారి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రజలకు భరోసా కల్పించి, దైర్యం చెప్పారు ఆ నమ్మకమే నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ తో గెలిచే విధంగా ఉపయోగపడింది.
నిజాయితీ, విధేయతకు మారు పేరుగా, ఏనాడూ కూడా పార్టీలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా హుందాగా వ్యవహరించిన తీరు భట్టి విక్రమార్కది.తన సత్ప్రవర్తనతో బాధ్యతాయుతంగా వ్యవహరించి పార్టీని ఈ రోజు శిఖరానికి చేరువలో తీసుకువచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థితిగతుల పైన అవగాహన, అనుభవం, అభివృద్ధి పైన విజన్ ఉన్న నాయకుడు.
Also Read:రేపటి నుండి ప్రజాదర్బార్:సీఎం రేవంత్