లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బతుకమ్మ సంబరాలు..

85
Bathukamma

లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యంలో స్థానిక కోవిడ్ నిబంధనల వలన నిరాడంబరంగా బతుకమ్మ వేడుకల్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ఫూర్తితో బతుకమ్మను విశ్వవ్యాప్తం చెయ్యాలనే ఆలోచనతో స్థానిక కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆరుగురికి మించకుండా, టాక్ మహిళలు చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బతుకమ్మ ఆట – పాటలాడి బతుకమ్మకు అరుదైన గౌరవాన్నిచ్చారు.

ప్రతీ సంవత్సరం వందల మంది ఆడబిడ్డలతో ఎంతో ఆనందం తో బతుకమ్మ వేడుకల్ని జరుపుకుంటామని, ఇది సంబరాలకు సమయం కాకపోయినా మన సంస్కృతి సంప్రదాయాల్ని మరువకుండా స్థానిక కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వినూత్నంగా చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద మన చారిత్రాత్మక బతుకమ్మ ఆట చూడడం చాలా గర్వంగా ఉందని, వాతావరణం అనుకూలంగా లేకపోయినా బతుకమ్మ పేర్చి ఆడి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న టాక్ ఆడబిడ్డలకు వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం కృతఙతలు తెలిపారు.

స్థానిక కోవిడ్ నిబంధనల వల్ల టాక్ కార్యవర్గ సభ్యులంతా వివిధ గ్రూప్ లుగా ఆరుగురికి మించకుండా బతుకమ్మ వేడుకల్ని జరుపుకున్నామని, కొంత మంది ఇంటికే పరిమితమై బతుకమ్మ పండగ జరుపుకున్నారని, మన సంస్కృతిని మరిచి పోకుండా ఎలాంటి పరిస్థితులున్న ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఆడిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది కృతజ్ఞతాభినందనాలు తెలిపారు.

London Bathukamma 2020 TAUK Tower Bridge - Media