తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక సంపద బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు,బ్రతుకు చిత్రానికి అద్దం పట్టే మన బతుకమ్మ మన జీవన విధానంలో బాగమైపోయింది. తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా బతుకమ్మ సందడే కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి పండుగ సప్తసముద్రాలు దాటితే ఎలా ఉంటుంది. సప్తసముద్రాలు దాటడమే కాదు ఆకాశంలో బతుకమ్మ సంబరాలు చూస్తే ఏలా ఉంటుంది. ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించింది జెట్ ఎయిర్‌వేస్.
విమానంలో జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది బతుకమ్మను పట్టుకుని పాటలు పాడుతూ ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బంది చీర కట్టులో ‘బతుకమ్మ-బతుకమ్మ’ పాట పాడుతూ లోపలి ప్రయాణికులను ఆకర్షించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Don't know which #airlines it was but Felt happy and proud by seeing this video Playing #Bathukamma in Flight @RaoKavitha @KTRTRS pic.twitter.com/eUyER5HI2y
— saajan sidhams (@SaajanSidhams) October 21, 2018