Bathukamma:ఐదో రోజు అట్ల బతుకమ్మ

51
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకునే ఆడబిడ్డలు ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఇవాళ ఐదో రోజు అట్ల బతుకమ్మ.

ఈ అట్ల బతుకమ్మ రోజున బియ్యంతో చేసిన అట్లు, దోశలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. నానబెట్టి బెట్టిన బియ్యాన్ని దంచి లేదా మర పట్టించి పిండిగా చేసి అట్లవేస్తారు. ఈ అట్లను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ అట్లను ముతైదువులకు వాయనంగా అందిస్తారు.

తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, చామంతి పూలు, మందారం, గుమ్మడి, తామర వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి సాయంత్రం సమయంలో అందరు ఒకచోట చేరి ఆడి పాడతారు.

Also Read:టైగర్ నాగేశ్వరరావు..ప్రేక్షకులని అలరిస్తుంది

- Advertisement -