కాన్ఫిడెన్స్ కాదు.. ఓవర్ కాన్ఫిడెన్స్?

35
- Advertisement -

ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలంటే కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఎందుకంటే ఆ పనిపై ఉండే నిబద్దత, పట్టుదల వల్ల కాన్ఫిడెన్స్ పెరిగి విజయం సొంతం అవుతుంది. కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్లు.. పని చేసే దైర్యం, పనిలో నిబద్దత లేకుండా ఆ పనిలో విజయం మాదే అంటే అది.. అది ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారి ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అన్నట్లుగా తయారవుతుంది. ఇదంతా ఎందుకనుకుంటున్నారా ? ప్రస్తుతం టి కాంగ్రెస్ లో పరిస్థితి చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో గెలుపు మాదే. మేమే అధికారం లోకి వస్తాం అంటూ హస్తం పార్టీ నేతలు చెబుతున్నా మాటలు చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ కు ప్రతిరూపంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. .

ఉదాహరణకు గత ఎన్నికల ముందు అదే పార్టీలో ఉన్న బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలనే పరిశీలిద్దాం. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయిన.. ఎన్నికల ముందే తానే గెలిచేసినట్లు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు, మీడియా సమక్షంలో ఆల్రెడీ గెలిచినట్లు ప్రమాణస్వీకారం చేయడం, అత్యధిక మెజారిటీ వచ్చిందని కలలుగనడం వంటివి చేశారు. తీర ఎన్నికల్లో టికెట్ రాక పొగా, కాంగ్రెస్ కూడా ఘోర ఓటమిని చవిచూసింది. దాంతో బండ్ల గణేశ్ కలలు పగటికలలుగానే మాగిలిపోయాయి.

ఇప్పుడు అదే విధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పగటి కలలు కంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, డిసెంబర్ 9 న ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తామని పగలే కలలు కంటున్నారు. అసలు హస్తం పార్టీపై ప్రజల్లో ఏ కోశాన కూడా నమ్మకం లేదనే సంగతి వారికి కూడా తెలిసిందే. అందుకే రాష్ట్రనికి ఇచ్చింది కాంగ్రెసే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. రాష్ట్రాన్ని తెచ్చింది కే‌సి‌ఆర్ అని అధికారాన్ని కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు. అందువల్ల కాంగ్రెస్ గెలుపు విషయంలో కంటున్న కలలు పగటి కలలే తప్పా.. వాస్తవాలు కాదనేది అందరికీ తెలిసిన విషయమే.

Also Read:BJP:అభ్యర్థులు కావాలండోయ్ !

- Advertisement -