- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాల్లో మార్చి నాటికి 134రకాల పరీక్షలు అందుబాటులోకి తెస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. బస్తీదవాఖానాల్లో త్వరగా రోగాలు కూడా నయమవుతున్నాయన అన్నారు. ఇప్పటి వరకు కోటి మందికిపైగా ప్రజలు చికిత్స పొందారని తెలిపారు. ఇందులో ఉచితంగా లిపిడ్ ప్రొఫైల్ థైరాయిడ్ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని వివరించారు.
బస్తీ దవాఖానాల్లో 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో న్యూట్రిషియన్ కిట్స్ అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో త్వరలోనే 1540ఆశా పోస్టుల భర్తీ చేపడతామన్నాని…జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హరీష్‌రావు అన్నారు. బస్తీ దవాఖానా ఏర్పాటు వల్ల ఉస్మానియా గాంధీ ఆసుపత్రిపై ఓపీ భారం తగ్గిందన్నారు.
ఇవి కూడా చదవండి…
ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాలి:మోదీ
డిప్యూటీ ఛైర్మన్‌ను అభినందించిన మంత్రులు
21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతి..
- Advertisement -