22న బస్తీ దవాఖానాలు ప్రారంభం

288
talasani
- Advertisement -

అందరికీ అందుబాటులో అరోగ్యం అనే స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ వైద్య అరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడంతోపాటు పట్టణాల్లో బస్తీ దవాఖాన వంటి వినూత్నమైన ఏర్పాట్లతో ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌లో ఇప్పటికే 123 బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులోకి రాగా ఈ నెల 22న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు.

నూతన బస్తీ దవాఖానాలతో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. బస్తీ దవాఖానాలో వైద్యుడు, నర్సు, సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 22, మేడ్చల్‌ జిల్లాలో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో మూడు బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు తలసాని వెల్లడించారు.

- Advertisement -